సుపరిపాలన జగన్ తోనే సాధ్యం – మదనపల్లి ఎం.ఎల్.ఎ దేశాయ్ తిప్పారెడ్డి

0
89
advertisment

నీరుగట్టువారిపల్లిలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం

మనఛానల్ న్యూస్ – మదనపల్లి

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు  సుపరిపాలన ఒక్క జగన్ మోహన్ రెడ్డి తోనే సాధ్యమని మదనపల్లి ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. రావాలి జగన్…కావాలి జగన్ కార్యక్రమం లో భాగంగా ఆదివారం ఉదయం నీరుగట్టువారిపల్లి లో ఆయన పర్యటించారు.

ఈసందర్భంగా ఆయన పలువీధులలో పర్యటిస్తూ ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వచ్చే ఏడాది రాబోయే రాజన్న రాజ్యంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అంత వరకు ఓపికతో ఉండాలని భరోసా ఇచ్చారు.

వీవర్స్ కాలనీ. జన్మభుామికాలనీ మునెప్ప కాలనీ లలో పర్యటించారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి తో పాటు వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రతి ఓటర్ల ను కలుసుకొని జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల గురించి  ప్రజలకు తెలియజేశారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలవారికి మేలు జరుగుతుందని, ఈ ఒక్క సారి జగన్ మోహన్ రెడ్డి కి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై మీ ఓటు వేసి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.