
మనఛానల్ న్యూస్ – మదనపల్లి
అంగళ్లు సమీపంలోని మదనపల్లి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్ కళాశా) నందు మదనపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశా విద్యార్థినీలకు “కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫండమెంటల్స్” పై 10 రోజులపాటు ట్రైనింగ్ ను నిర్వ హించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విద్యార్ధికి ఇంటర్మీడియట్ అయిపోయే లోపు కంప్యూటర్ పై అవగాహన కల్పించేందుకు ట్రైనర్లను తమ కళాశాలకు పంపి విద్యార్థులకు శిక్షణను అందించేలా కృషి చేస్తున్నదన్నారు.
ముఖ్యంగా సమాజంలో కంప్యూటర్ లేకుండా మానవ మనుగడ కష్టమన్నారు. నైపుణ్యంలో యువతకు శిక్షణ అవసరమని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని యువరాజ్ అన్నారు. విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ పై శిక్షణను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ట్రైనర్లుగా నాగరాజు మరియు ప్రవీణ్ లు పాల్గొన్నారని ఆయన అన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ఇవి చాలా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అతివేగంగా ఇచ్చిన పనిని చేయగల సామర్థ్యం, మరియు ఎంతో మంది చేయగలిగే పనిని అతి తక్కువ సమయంలో చేయడంలో కంప్యూటర్ ఎంతో ముఖ్యమైనదని, ఇదే కాకుండా వివిధ రంగాలలో సినిమా, రైల్వే, బస్సు, విమాన సర్వీసులలోనే కాకుండా ఉపగ్రహ ప్రయోగాలలో కూడా కంప్యూటర్ ఎంతో ముఖ్యమైనదన్నారు.
మైక్రోసాఫ్టు ఆఫీస్ నందు గల వర్డ్ లో షార్ట్ కట్ కీస్ గురించి విద్యార్థులకు తెలియజేశారని, ఒక విషయం గురించి డాక్యుమెంట్ తయారు చేయడానికి గల విద్యార్థులకు వివరించి, ప్రాక్టికల్ ద్వారా విద్యార్థులకు శిక్షణను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నార్నె మరియు విద్యార్థులు పాల్గొన్నారు.