హెల్ఫింగ్‌ మైండ్స్‌ ఆధ్వర్యంలో బి.కొత్తకోటలో అబ్దుల్‌ కలాం జయంతి వేడుకలు

0
415

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
మిస్సైల్‌ మ్యాన్‌, భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపిజె అబ్దుల్‌ కలాం 87వ జయంతి వేడుకలను బి.కొత్తకోటలోని జ్యోతి చౌక్‌ నందు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం హెల్ఫింగ్‌ మైండ్స్‌ బి.కొత్తకోట ఇంఛార్జ్‌లు జాబీర్‌, బావాజాన్‌లు మాట్లాడుతూ అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకొని హెల్పింగ్ మైండ్స్ సేవలు కొనసాగుతున్నాయని,ఆయన భారత దేశానికి చేసిన సేవలకుగాను రక్తదాన శిబిరం నిర్వహించామని, యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛందగా రక్తదానం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.

కలాం ఆశయాలను యువతకు తెలియజేసి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం విద్యార్థులకు గర్వకారణమని పేర్కొన్నారు.

హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ మదనపల్లి కేంద్రంగా కొనసాగుతున్న హెల్పింగ్ మైండ్స్ సేవలు పలు ప్రాంతాల్లో సంస్థ సభ్యుల సహకారంతో అందుతున్నాయని,ముఖ్యంగా ఇది వరకే బి.కొత్తకోటలో సంస్థ సేవలు అందుతున్నాయని,కలాం జయంతి రోజు రక్తదాన శిబిరం నిర్వహించడం శుభపరిణామమన్నారు.

మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వారు యువకుల నుండి రక్తం సేకరించారని,రక్తం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఆ రక్తం అందజేస్తారని పేర్కొన్నారు .కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు నక్క మహేష్,ఆదిల్,దశరథ్, ఫయాజ్ , నవాజ్,మని,నితీష్, సాయితేజ,అనిల్ ,షఫీ, మంజునాథ్ మరియు రక్తనిధి సిబ్బంది పాల్గొన్నారు.