మిట్స్ లో పారిశ్రామిక అవసరాలకు భవిష్యత్ లో ఎలక్ట్రకల్స్ ప్రాధాన్యతపై సెమినార్

0
174

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
భవిష్యత్ లో పారిశ్రామిక అవసరాలకు ఎలక్ట్రికల్ ఎంతో ప్రాధన్యత ఉందని మదనపల్లిలోని మిట్స్ ఇంజనీరింగ్ కళశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన సెమినార్లో  వక్తలు అభిప్రాయపడ్డారు.

బి.టెక్ లో సంబంధిత విభాగం విద్యార్థులకు కోసం  ” ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత – భవిష్యత్ లో వాస్తవ పారిశ్రామిక అవసరాలు ” అనే అంశంపై జరిగిన సెమినార్ లో బెంగుళూరుకు చెందిన సిమ్ లైఫ్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటడ్ సంస్థ సాంకేతిక నిపుణుడు డాక్టర్ పవన్ కుమార్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు.

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ పురోగతికి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ప్రాధాన్యత ఎంతో ఉందని, అదేవిధంగా పరిశ్రమలు దేశ పురోగతిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విద్యుత్ అనేది పరిశ్రమలకు శ్వాస అని, ఏ పరిశ్రమలలో నైనా యంత్రాలు పనిచేయుటకు కావలసిన విద్యుత్ ను ఎలా సరఫరా చేయాలో ఆయన వివరించారు.

ఆధునిక ప్రపంచంలో విద్యుత్ వాడకం పెరిగిందని, ఈ పరిస్థితులలో మారుతున్న కాలానికి అనుకూలంగా ఉన్న హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయాగించే హైబ్రిడ్ ఇన్వెర్టర్ ను మొదటిగా తాను కనుక్కున్నట్లు తెలిపారు. రానున్న రోజులలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతూ వారి ఏన్నో ఉదోగ్యావకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగ అధిపతి డాక్టర్ ఆశారాణి, డీన్ కె.ఆర్.కేశ్వాన్, డాక్టర్. ఇలంపూర్ణాం, డాక్టర్ పి.బి.ఎన్ ప్రసాద్ మరియు తదితరులు పాల్గోన్నారు