జేఎన్‌టియుఎ జట్టుకు ఎంపికైన మిట్స్‌ కళాశాల విద్యార్థులు

0
49

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
చిత్తూరుజిల్లా మదనపల్లి సమీపంలో నెలకొని ఉన్న మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల)లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఇటీవల JNTUA నిర్వహించిన స్పోర్ట్స్ నందు ప్రతిభ కనపరచి మరియు JNTUA టీంకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్ తెలిపారు.

JNTUA నిర్వహించిన స్పోర్ట్స్ లో వాలీబాల్ టీంకు ద్వితీయ సంవత్సరం ఎంబిఏ చదువుతున్న G.రాజశేఖర్, మరియు బీ.టెక్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతున్న R.శ్రావణిలు ఎంపిక అయినట్లు, అదేవిధంగా ఇదే కళాశాలలో బీ.టెక్ CSE మూడవ సంవత్సరం చదువుతున్న M.S యస్వంత్ టేబుల్ టెన్నిస్ విభాగ౦లో JNTUA ఇంటర్ యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయినట్లుగా ప్రిన్సిపాల్ తెలిపారు.

ఈ జట్టుకు ఎంపికైన విద్యార్థులు JNTUA university టీం తరుపున నిర్వహించే వివిధ స్పోర్ట్స్ నందు ఆడుతారని తెలిపారు. ఈ ఎంపికైన JNTUA యూనివర్సిటీ టీంలో స్థానం సంపాదించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.సి.యువరాజ్, సీనియర్ PD K. వెంకటరమణ , PD R. రాజేష్ విలియం మరియు అధ్యాపక బృందం ఈ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.