రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు మృతి

0
13
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ముంబయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు నితిన్‌ బాలీ మృతి చెందాడు. హిందీ చిత్రాలు మరియు ఎన్నో రీమిక్స్‌లో ఆయన ఆలపించారు. అదేవిధంగా 1990వ సంవత్సరంలో నితిన్ బాలీ పాడిన రీమిక్స్ పాట నీలీ నీలీ అంబర్ పర్ సంచలనం రేపింది.

నితిన్ బాలీ బోరివలి నుంచి మలాద్ వస్తూ వేగంగా కారు నడుపుతూ రోడ్డు డివైడర్ ను ఢీకొట్టాడు. వేగంగా కారు నడిపాడని నితిన్ బాలీని పోలీసుస్టేషనుకు తీసుకువచ్చి కేసు నమోదు చేసి బెయిలు ఇచ్చి ఆసుపత్రికి పంపించారు.

తలకు, ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినా వారి మాట వినకుండా నితిన్ బాలీ ఇంటికెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక కడుపునొప్పితో పాటు వాంతులు చేసుకున్నాడు.

నితిన్ బాలీలి ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే గుండె పోటుతో మరణించాడు. నితిన్ బాలీ ప్రముఖ టీవీ నటి రోమాను వివాహమాడారు. నితిన్ బాలీ అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.