విమానాశ్రయాలలో భద్రత సిబ్బంది నవ్వితే ఇంటికే…సీరియస్ డ్యూటికి ఆదేశాలు

0
334

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
మనం విమానాశ్రయంలోకి ప్రవేశించగానే భద్రత సిబ్బంది ఆప్యాయతతో నవ్వుతూ కనిపిస్తారు. స్నేహపూర్వకంగా లోపలికి రమ్మనట్లు కనుచూపులతో పలకరిస్తారు. అయితే ఇక నుంచి ప్రయాణికులతో చిరునవ్వుతో పలకరిస్తే ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపుతారు.

భద్రతా సిబ్బంది ప్రయాణికులతో స్నేహపూర్వక విధుల నిర్వహణ వల్ల అసాంఘిక శక్తులు నిషేదిత వస్తువులతో విమానాశ్రయాల లోనికి ప్రవేశించి సమస్యలు సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు పసిగట్టి ప్రయాణికులతో సీరియస్ వ్యవహరిచాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఇక నుంచి దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో సెక్యూరిటీ సిబ్బంది చిరునవ్వు నవ్వుతూ ప్రయాణికులను పలకరించకూడదు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పర్యవేక్షించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) అధికారులకు ఆదేశాలు పంపినట్లు సమాచారం.

ప్రయాణికులతో చెక్‌ పాయింట్ల వద్ద.. ఇతర చోట్ల సీరియస్‌గా వ్యవహరిస్తే సీఐఎస్‌ఎఫ్‌ దళాల నిఘా పక్కాగా ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

రోజురోజుకి విమానాశ్రయాలలో రద్దీ పెరుగుతున్న కారణంగా ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకొన్నారు. పెరుగుతున్న రద్దీకి తగ్గట్లు భద్రత సౌకర్యాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలో ఫేస్ డిటెక్టడ్ మిషన్లు రాబోతున్నాయి. దీని ద్వారా ప్రయాణికుడి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి.