రానున్న నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడుల్లో భారీ వర్షాలు

0
22
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఆగష్ట్‌ మాసంలో భారీ వర్షాలు, వరదల కేరళలో సృష్టించిన బీభత్స౦ అంతా ఇంతా కాదు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు న్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇప్పటికే భారీ వర్షాల కారణంగా కేరళలో కనీవినీ ఎరుగని రీతిలో నష్ట౦ వాటిల్లి౦ది. దీంతో భారత వాయు సేన సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా సహాయం అందించాల్సి రావొచ్చని అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కేరళకు చేరుకున్నాయి. వాయనాద్‌, పాలక్కాడ్‌, ఇడుక్కి, పథనంతిట్ట, కోజికోడ్‌లలో ఈ బృందాలు మోహరించాయి.

తమిళనాడు, పుదుచ్చేరిలలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా యంత్రాగాలకు మార్గదర్శకాలు జారీ చేశాయి.కేరళలో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఇడుక్కిలో 7వ తేదీన రెడ్‌ అలర్ట్‌, 6,8 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్‌ ప్రకటించింది. మలప్పురం, పాలక్కాడ్‌, వాయనాద్‌, పథనంతిట్ట జిల్లాలో 6,7,8 తేదీల్లో కుంభ వృష్టి కురిసే అవకాశం ఉంది.

కేరళలో మున్నార్‌ సహా ఎత్తైన పర్యాటక ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు, కర్ణాటకలో స్వల్ప వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.