రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎంవీవీఎస్‌ మూర్తి మృతి

0
718

మనఛానల్‌ న్యూస్‌ – విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని ప్రముఖ గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు మరియు తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు ఎంవీవీఎస్‌ మూర్తి రోడ్డుప్రమాదంలో మృతిచెందారు.అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తితో పాటు మరో ముగ్గురు మృతిచెందారు.

అలస్కాలోని ఆంకరేజ్‌ సిటీలో మ౦గళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో మూర్తితోపాటు మరో నలుగురు కారులో ఉండగా అందులో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే కడియాల వెంకట రత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు.

కాగా ప్రమాద వార్త తెలుసుకున్న తానా సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించించేందుకు ఎంవీవీఎస్‌ మూర్తి అమెరికా వెళ్లారు.

విద్యారంగంతోపాటు, రాజకీయ రంగంలో కూడా విశేష సేవల౦దించిన ఎంవీవీఎస్‌ మూర్తి మృతి చెందడం తీరని లోటని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.