విజయ్ దేవరకొండకు ఆ అందాల రాశేనా జోడి..!!!!

0
159
advertisment

మనఛానల్ న్యూస్ – సనిమా డెస్క్
తెలుగు సినీ జగత్తులో ఎందరో అభిమానులను సంపాయించుకొన్న అలనాటి అందాల తార శ్రీదేవి ఇప్పుడు మన కళ్ల ముందు లేకపోయినప్పుటికి ఆమె అందాలను తనలో దాచుకొన్న శ్రీదేవి కుమార్తె జాన్వీ ఇప్పుటికే బాలీవుడ్ లో అరంగ్రేటంతో తాను ఏమిటో నిరూపించుకొని తల్లికి తగ్గ తనయ అని నిరూపించుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

త్వరలో జాన్వీ తెలుగులో సైతం సినీ రంగ ప్రవేశానికి ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. అనంత లోకాలకెగిన ఆ‘అతిలోకసుందరి’ తన తనయ జాన్వీ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.

జాన్వీ ఇప్పుటికే మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘సైరాట్‌’కు రీమేక్ గా వచ్చిన ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.అయితే త్వరలో జాన్వి.. తెలుగు లో నవ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు జోడీగా ఈమె ఓ చిత్రంలో నటించబోతున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి.

తెలుగుతో  పాటు హిందిలో ‘తఖ్త్‌’ అనే చిత్రంలో జాన్వి నటించబోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ రంగంలో మకుటం లేని మహా రాణిగా వెలుగొందిన శ్రీదేవికి తగ్గ కుతూరుగా జాన్వీ నిరూపించుకొంటుందా లేదా వేచి చూడాలి.