గల్ల౦తైన మరో 19 మంది రూర్కీ ఐఐటీ విద్యార్థులు

0
326

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఐఐటీ రూర్కీకి చెందిన మరో 19 మంది విద్యార్థులు ఉత్తరాఖండ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లి కనిపించకుండా పోయినట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం ట్రెక్కింగ్‌కు వెళ్లి వరదల్లో చిక్కుకున్న 50 మంది రూర్కీ ఐఐటి విద్యార్థులను భారత వైమానిక దళం రక్షించిన సంగతి తెలిసిందే.విద్యార్థులు ఉత్తరాఖండ్‌లో తెహ్రిలోని గాంగి ప్రాంతం నుంచి కేదార్‌నాథ్‌కు ట్రెక్కింగ్‌కు వెళ్లారని, వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని రుద్రప్రయాగ ఎస్పీ వెల్లడించారు.

హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ వరదలు సంభవిస్తున్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాలతో పాటు మంచు విపరీతంగా కురుస్తుండడంతో పర్వతారోహకులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

దిల్లీ, సిమ్లా నుంచి గత శుక్రవారం పర్వతారోహణకు వెళ్లిన ఆరుగురు వ్యక్తులు గల్లంతు కాగా వారి కోసం గాలిస్తున్నారు. రాష్ట్రంలోని కులు, మనాలీ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.