వరదయ్యపాళెంలో రేపు వన్ హ్యుమానిటీ కేర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

0
16
advertisment

మనఛానల్ న్యూస్ – శ్రీకాళహస్తి
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని వన్ హ్యుమానిటీ కేర్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 9గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆసంస్థ ప్రతినిధి ఒకరు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమం వన్  హ్యామనిటి కేర్ స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ ట్రస్టీ లోకేష్ దాసాజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు  తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం వరదయ్యపాళెం మండలం గోవర్థనపురంలోని వన్ హ్యుమానిటీ కేర్ కార్యాలయం నుండి ఆదివారం ఉదయం 9గంటలకు  నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఆదివారం జరిగే ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో వన్ హ్యుమానిటీ కేర్ జోన్ లీడర్లు, కో-ఆర్డినేటర్లు, విద్యావాలంటీర్లు, నాయకులు, స్థానికులు పాల్గోని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ ప్రధాన ఉద్ద్యేశంగా వారు వివరించారు.