రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్బీణీలకు పౌష్టికాహారం పంపిణీ

0
271

మనఛానల్ న్యూస్ – రాయచోటి
వై.ఎస్.ఆర్ కడప జిల్లా రాయచోటి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఎన్జీవో కాలనీ నందు గర్బిణీలకు బుధవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ చిన్నపరెడ్డి దాతృత్వంలో దత్తత తీసుకున్నటువంటి గర్భిణీ స్త్రీలకు పాలు, గుడ్లు, పండ్లు తదితర పౌష్టికాహారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గోన్న లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ రెడ్డి కీర్తి మాట్లాడుతూ జూలై నెలలో ఇదివరకే ఇద్దరు గర్భిణీ స్త్రీలను లయన్స్ క్లబ్ వారు దత్తత తీసుకున్నామన్నారు. అందులో భాగంగానే పేద గర్బిణీ మహిళలకు ఈ పౌష్టికాహారం అందించడం జరిగుతోందని తెలిపారు.

పేద గర్భిణీలు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ప్రసవ సమయంలో రక్తహీనతతో బాధపడుతున్నారని అందువల్ల తల్లి , బిడ్డ ప్రసవ సమయంలో ఇబ్బంది పడుతున్నారని ఇటువంటి సమస్యలు నివారించి సుఖ ప్రసవన, తల్లి, బిడ్ఢ సంక్షేమం ధ్యేయంగా రాయచోటి లయన్స్ క్లబ్ మహిళలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా బుధవారం ఒక గర్భిణీ స్త్రీకి శ్రీమంతం జరిపామని, మరొక గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం అందించామని అన్నారు.

సరైన పోషకాహారం తీసుకోక పోవడం వల్ల పుట్టే శిశువులకు కూడ అనారోగ్యాల బారిన పడరని డాక్టర్ రెడ్డి కీర్తి వివరించారు. ఈ కార్యక్రమంలోలయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, డిస్టిక్ చైర్మన్ లయన్ అన్వర్ బాషా ,డిస్టిక్ చైర్మన్ లయన్ అశోక్ రెడ్డి, డిస్టిక్ చైర్మన్ లయన్ నారాయణరెడ్డి ,కార్యదర్శి చాన్ భాషా మరియు గర్భిణీ స్త్రీలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.