విడుదలకు సిద్ధమైన ‘‘సామి’’

0
32
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
హరి దర్శకత్వం వహిస్తూ, చియాన్‌ విక్రమ కథానాయకుడుగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘‘సామి స్క్వైర్‌’’. ఇందులో కీర్తి సురేష్‌ కథానాయకిగా నటిస్తున్నది.తెలుగులో ‘సామి’ పేరుతో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘సామి’ని సెప్టెంబరు 21న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌పై బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్‌లు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

విక్రమ్-హరి కాంబినేషన్లో గతంలో వచ్చిన తమిళ ‘సామి’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్‌తోనే హరి దుమ్ము దులిపేశారు.

విక్రమ్‌ నట విశ్వరూపం ఇందులో చూస్తారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.