బుచ్చిరెడ్డి గారి పల్లి పాఠశాల లో విద్యార్థుల కోసం ఉచిత వైద్య అవగాహన శిబిరం

0
24
advertisment

మనఛానల్ న్యూస్ – బి.కొత్తకోట
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారి పల్లి ప్రాధమికోన్నత పాఠశాల లోని విద్యార్థుల కోసం ఉచిత వైద్య అవగాహన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు.

ఈ శిబిరం లో  బి.కొత్తకోట ప్రభుత్వ వైద్యశాల  ఆయుష్ విభాగానికి చెందిన సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా॥ శ్రీనివాసులు పాల్గోని విద్యార్థులకు వివిధ విషయాలపై అవగాహన కల్పించారు. మంచి ఆహారపు అలవాట్లు అలవచ్చుకోవాలని సూచించారు.

విద్యార్థులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతల గురించి మరియు సీజనల్ వ్యాధులు రాకుండా వారు ఇళ్లలో, పాఠశాలలో, పరిసరాలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు.

ప్రత్యేకించి గ్రామాలలో త్రాగు నీరు గురించి, పరిసరాలు ఎలా పరిశుభ్రం గా ఉంచుకోవాలో వివరించారు. చిరు తిండ్ల అలవాట్లు వల్ల వచ్చే అనారోగ్యాలపై ఆయన పిల్లలకు విశదకీరించి తెలిపారు.

ఈ సమావేశం లో ప్రధానోపాథ్యాయులు పి.ఢిల్లీ ప్రసాద్ మాట్లాడుతూ భావి తరం పౌరులైన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం ఎంతో అభివృద్ది చెందుతుందని,ఆధునిక యుగంలో నానాటికి పెరుగుతున్న భయంకర రోగాల భారిన పడకుకుండ ఉండేందుకు పిల్లలను చిన్న వయసునుంచి మంచి అలవాట్లు నేర్చుకోవల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

advertisment

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విజయ లక్ష్మి, లక్ష్మి, ప్రభాకర రెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.