బిగ్ బాస్ హౌస్ లోకి కుటుంబసభ్యులు

0
44
advertisment

మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
తెలుగులో ఎంతో ప్రేక్షకాదరణ అందుకొన్న బిగ్ బాస్-2 విజయవంతంగా కొనసాగుతోంది. 93 రోజులుగా వివిధ మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా కొనసాగుతున్న ఈ షోలోకి మంగళవారం పలువురు పార్టిషిపెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చి అందరితో కలిసి ఆనందంగా గడిపి సభ్యులందరిని ఉత్సహపర్చారు.

ప్రీజ్ టాస్క్ నడుస్తున్న తరుణంలో కుటుంబసభ్యులను హౌస్ లోకి ప్రవేశ పెట్టి కొంత సేపు ఉత్కంఠతకు గురిచేశారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించారు.మంగళ వారం తొలిసారి హౌస్ లోకి సామ్రాట్ తల్లి జయారెడ్డి వచ్చారు.

ఆమె వచ్చే సమయానికి బిగ్ బాస్ అందరిని ప్రీజ్ చేశారు. దీంతో ఆమె హౌస్ లోకి వచ్చినప్పుటికి ఎవరు కదలకుండ ఉండడంతో ఆమె అందరి వద్దకు వెళ్లి పలకరించింది. అందరూ కలిసి హ్యాపి గా ఉండాలని సూచించారు.టైటిల్ వచ్చినా రాకపోయినా బాథపడవద్దని ఇంతవరకు హౌస్ లో కొనసాగడమే గొప్ప విషయమని అన్నారు.ఈసందర్బంగా ఇంటి సభ్యులందరూ ఆమె ఆశీర్వాదం తీసుకొన్నారు.

అనంతరం అమిత్ తివారి కుటుంబం నుంచి భార్య పూజ, కుమారుడిని హౌస్ లోకి పంపి కొంత సేపు సభ్యులతో గడిపే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సభ్యులంతా అమిత్ తివారి కుమారుడితో కాసేపు సరదాగా గడిపారు. కౌశిల్, రోల్ రైడాలు చాక్లెట్స్ ఇచ్చి పిల్లవాడిని కాసేపు ఎత్తుకొని హౌస్ లో కలియతిరగారు.

ఈ సందర్భంగా అమిత్ కుమారుడు సభ్యులను కలవడానికి మంకీ క్యాప్ వేసుకొని పరుగెడుతుండగా పొరపాటున అద్దం తగలడం తో కింద పడ్డాడు. దీంతో సభ్యులంతా కాసేపు టెన్షన్ పడ్డారు. పిల్లవాడి ఏడుపును మాన్పించడానికి కొంతసేపు నవ్వించారు.

advertisment

జోకర్ హంగమా
మంగళవారం బిగ్ బాస్ హౌస్ జోకర్ ను హౌస్ లోకి పంపి సభ్యులందరిని ప్రీజ్ లో పెట్టడంతో జోకర్ వారిని ఇరిటేషన్ పెట్టారు. జోకర్ చేష్టలతో ప్రేక్షకులు కడుపు ఉబ్బేలా నవ్వేశారు.ఈ సందర్భంగా రోల్ రైడా ముఖానికి కేక్ పూసి కొంత ఇరిటేషన్ చేశారు. అనంతరం జోకర్ ను ఇంటిలో నుంచి భయటకు పంపి సభ్యులను ప్రీజ్ నుంచి రీలీజ్ చేయగానే సభ్యులంతా జోకర్ ను పట్టుకోవడానికి డోర్ వైపు పరుగెత్తారు. ఈ లోపు జోకర్ డోర్ దాటుకొని వెళ్లిపోవడంతో సభ్యులు నిరాశకు గురయ్యారు.

మంగళవారం బిగ్ బాస్ హోస్ మరో సభ్యురాలు దీప్తి కుటుంబసభ్యులను యధావిదిగా సభ్యులందరిని ప్రీజ్ లో పెట్టి దీప్తి కుమారుడు సిద్దును మెుదటి పంపి కొంత సేపు తరువాత ఆమె భర్త శ్రీకాంత్ ను ఇంటి లోకి దీప్తిని ఆనందపర్చారు. వీరు హౌస్ లోని వారందరితో కొంత సేపు గడిపారు.