
మనఛానల్ న్యూస్ – స్పోర్ట్స్ డెస్క్
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఈ పోటీలను దక్షిణ కొరియా నిర్వహిస్తోన్నది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ పురుషుల, మహిళల విభాగంలో భారత షూటర్లు రెండు పసిడి పతకాలు సాధించారు.
పురుషుల విభాగంలో హృదయ్ హజరికా స్వర్ణం గెలుచుకోగా.. మహిళల విభాగంలో ఎలవెనిల్ వలరివన్, శ్రేయా అగర్వాల్, మానిని కౌశిక్ బృందం బంగారు పతకం సాధించింది.
627.3 స్కోరుతో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌కు అర్హత సాధించిన హృదయ్.. ఫైనల్లో 250.1 స్కోరుతో ఇరాన్ షూటర్ మహ్మద్ అమీర్ నెకోనమ్తో సమం అయ్యాడు. దీంతో షూట్‌ఆఫ్ నిర్వహించగా.. హృదయ్ పసిడిని సొంతం చేసుకున్నాడు.
ఇరాన్ షూటర్‌కు రజతం దక్కింది.ఇక మహిళల 10మీటర్ల ఎయిర్‌రైఫిల్ జూనియర్ టీం విభాగంలో భారత్‌కు చెందిన ఎలవెనిల్ వలరివన్(631 స్కోరు), శ్రేయా అగర్వాల్(628.5), మానికి కౌశిక్(621.2) బృందం స్వర్ణం గెలుచుకుంది. అంతేగాక.. మొత్తం 1880.7 స్కోరుతో ఈ విభాగంలో ప్రపంచ రికార్డును నమోదుచేసింది.