తెలంగాణాలో టి.ఆర్.ఎస్ 105స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన కె.సి.ఆర్

0
240

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతరం సి.ఎం. కె.సి.ఆర్ మీడియాతో మాట్లాడుతూ వివిధ విషయాల గురించి చర్చిస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను కె.సి.ఆర్ ప్రకటించారు.105 స్థానాలకు సిట్టింగ్ లకే  టికెట్ ప్రకటించారు. 14 స్థానాలకు టికెట్స్ పెండింగ్ లో పెట్టారు.
– చెన్నూరు, సంగారెడ్డి ఎం.ఎల్.ఎలకు టికెట్ నిరాకరించడం జరిగింది. 5 మంది సిట్టింగ్ ఎం.ఎల్.ఎలకు టికెట్ లు పెండింగ్ లో పెట్టడం జరిగింది. అందులో మెడ్చల్, మల్కాజిగిరి, చొప్పదండి, వికారబాద్, వరంగల్ బి నియోజకవర్గాల అభ్యర్థులకు పెండింగ్ లో పెట్టడం జరిగింది.
పార్టీలో అన్ని స్ఠాయిలలో చర్చించి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కె.సి.ఆర్. తెలిపారు.