తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ యే నెం.1 విలన్ – సి.ఎం. కె.సి.ఆర్

0
17
advertisment

మనచానల్ న్యూస్ – హైదరబాద్
తెలంగాణ అపద్దర్మ సి.ఎం. కె.సి.ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ముష్టిగా ఇవ్వలేదని అది మన పోరాటంతో సాధించుకొన్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి తెలంగాణకు వ్యతిరేకమని…మన రాష్ట్రానికి విలన్ అని..కె.సి.ఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన పీడ, దరద్రమని దానిని వదలకొట్టాలని ఆయన అన్నారు. నెహ్రు, ఇందిరాగాందిలు తెలంగాణకు ఎంతో అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీ బిక్ష కాదు ప్రజలు కొట్లాడి తెచ్చు కొన్నారు.తెలంగాణ ఆవిర్బావానికి ముందు ప్రజలు ఎన్నో కష్టనష్టాలు పడ్డారు. తెలంగాణ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.

మునుపు తెలంగాణలో మట్కాలు, జూదాలు, కర్ఫ్యూలు,హత్యలు ఎన్నో ఆకృత్యాలు జరిగాయి. తెలంగాణ ఆవిర్బవించి టి.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు.

దేశంలో రైతులకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కె.సి.ఆర్ అన్నారు. వచ్చే ఎన్నికలలో టి.ఆర్.ఎస్ను మళ్లీ గెలిపించి తెలంగాణాకు పట్టిన కాంగ్రెస్ పీడను వదిలించాలని కె.సి.ఆరే కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకొంటున్నారు. సంక్షేమ పథకాల ప్రకటనలో తమకున్న చిత్తశుద్ది కాంగ్రెస్ కు లేదు.

తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక తొలి కెబినెట్ సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకొన్నాం. ఇప్పటి వరకు మ్యాన్ ఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని మరో 76 హామీలను ప్రజల అవసరం గుర్తించి అమలు చేశాం.
ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 2.60లక్షల డబుల్ బెడ్ రూమ్లు ఇళ్లు మంజూరు చేశాం. చాలా ఇల్లు త్వరలో నిర్మాణం అవుతాయని కె.సి.ఆర్ తెలిపారు.

గెలుపు మాదే

advertisment

త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ తామే అధికారంలోకి వస్తావని తెలంగాంణ సి.ఎం. కె.సి.ఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్షాలు మాకెంతో దూరంగా ఉన్నాయన్నారు.

100 స్థానాలలో టి.ఆర్.ఎస్ 50 శాతం ముందంజులో ఉందన్నారు. ఈ ఎన్నికలలో తాము ఎం.ఐ.ఎంతో పొత్తు పెట్టుకొంటామని కె.సి.ఆర్ వెల్లడించారు. బిజెపితో పొత్తు ప్రసక్తేలేదని తెలిపారు. టి.ఆర్.ఎస్ పార్టీ 100శాతం సెక్యులర్ పార్టీ అని కె.సి.ఆర్ అన్నారు. తెలంగాణలో బిజెపికి పెద్ద బలం లేదని ఉన్న సీట్లు కాపాడుకొంటే చాలని అన్నారు. టి.ఆర్.ఎస్ పొత్తుకు బిజెపి సైతం సుముఖతతో లేదని, ఈవిషయాన్ని  అమిత్ షా నే స్వయంగా ప్రకటించినట్లు కె.సి.ఆర్ వెల్లడించారు. బిజెపి ఉన్న సీట్లు నిలబెట్టుకొంటే చాలు  ఎం.ఐ.ఎం తో పొత్తు కొనసాగుతుంది. బిజెపితో కలవం. మాది సెక్యులరీ పార్టీ, అంశాల వారి కొన్ని సార్లు మద్దతు ఇచ్చాం.