కేరళ వరదబాధితులకు మదనపల్లి ప్రైవేటు పాఠశాలల సంఘం విరాళం రూ.2,03,616

0
63
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
కేరళలో వరదల వల్ల నష్టపోయిన భాదితులకోసం మదనపల్లి పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల మేనేజ్ మెంట్ అసోషియేషన్ రూ.2,03,616ల విరాళాన్ని సేకరించి మదనపల్లి ఎం.ఇ.ఓ ప్రభాకర్ రెడ్డికి విరాళం చెక్కును శనివారం  అందచేశారు.  ఈ సందర్భంగా మదనపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రైవేటు పాఠశాల యజమానులు విలేకర్ల సమావేశం నిర్వహించారు.

జ్ఞానోదయ పాఠశాల కరెస్పాండెంట్ కామకోటి ప్రసాద రావు మాట్లాడుతూ కేరళలో సంభవించిన వరదల వల్ల ప్రజానీకం ఎంతో ఇబ్బంది పడుతోందని వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరమెంతో ఉందని ఆయన అన్నారు.

మదనపల్లి లోని ప్రైవేటు పాఠశాల యజమానులు కేరళ వరద బాధితుల కోసం తమ వంతు సాయంగా ఈ చిరుసహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెవిన్ హిల్స్ పాఠశాల కరెస్పాండెంట్ రఘునాథరెడ్డి, లిటిల్ ప్లవర్ స్కూల్ కరెస్పాండెంట్ ఎన్. రామకృష్ణా రెడ్డి మరియు పలువురు ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్స్ పాల్గోన్నారు.