హిల్సా చేపల ఉత్పత్తిలో బంగ్లాదేశ్ ప్రధమం – చేపతో మన ఆరోగ్యం

0
24
advertisment

మనఛానల్ న్యూస్ – బిజినెస్ డెస్క్

ప్రపంచంలో హిల్సా చేపల ఉత్పత్తిలో బంగ్లాదేశ్ ప్రధమ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 66 శాతం హిల్సా చేపల ఉత్పత్తిని ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండడం విశేషం. గత 9 సంవత్సారాలుగా బంగ్లాదేశ్ తన స్థానాన్ని పదిల పర్చుకొంది.

బంగ్లాదేశ్ రాజధాని డాకాలో బంగ్లాదేశ్ జాతీయ పరిశోధన మండలి ఆడిటోరియంలో నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాపు సందర్బంగా ఆదేశ వ్యవసాయ శాఖ మంత్రి ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. ఈ వర్క్ షాపును బంగ్లాదేశ్ చేపల పరిశోధక సంస్థ నిర్వహించింది.

చేపల తినడం వల్ల ఉపయోగాలు ఎన్నో…

  •  చేపలను తినడం వల్ల రక్తంలో ఉండే ట్రై గ్లిజరిడ్స్ 30 శాతం వరకు తగ్గుతాయని పరిశోధనలో వెల్లడైంది. దీంతో గుండె జబ్బులు బారిగా తగ్గుముఖం పడుతాయి.
  •  మనం తినే చేపల్లో విటమిన్ డి మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సూర్యకాంతి ద్వారా మనకు లభించే విటమిన్ డికి తగ్గ విధంగా డివిటమిన్ పోషకాలు ఈ చేపల ద్వారా లభిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా చేపల్లో సమృద్ధిగాఉంటాయు. దీనివల్ల మెదడు ఉత్తేజంగా పనిచేస్తుంది.
  •  అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధులు మీ దరిదాపులకు రావు అని వైద్యలు అంటున్నారు. చేపలను రెగ్యులర్‌గా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  •  చేపల ఆహారం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. చేపలను ఆహారం గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచింది.