ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు

0
56
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
సినీ నటుడు, మాజీ ఎం.పి, దివంగత ఎన్.టి.ఆర్ తనయుడు, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం సాయంకాలం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.

హరికృష్ణ చితికి రెండో కుమారుడు కల్యాణ్‌రామ్‌ నిప్పంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు,హరికృష్ణ సోదరులు జయకృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ ఆత్మీయుడు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, పలువురు బంధువులు మహాప్రస్థానానికి చేరుకుని హరికృష్ణ పార్థవ దేహం పాడెను మోశారు.

మద్యాహ్నం 2గంటలకు మెహదీపట్నం లోని హరికృష్ణ నివాసం నుంచి మహాప్రస్థానం వరకూ సాగిన అంతిమయాత్రలో వివిధ సినీ, రాజకీయ, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు, జూనియర్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ, బాలకృష్ణ అభిమానులు, తెదేపా నేతలు  ఊరేగింపులో భారీగా పాల్గొన్నారు.

దారిపొడువున పలువురు అభిమానులు హరికృష్ణ వెళ్లుతున్న అంతిమ యాత్ర రథంపై పూల వర్షం కురిపించి తమ అభిమాన నేతకు ఘనంగా కన్నీటి వీడ్కోలు పలికారు.

ఎపి సి.ఎం. చంద్రబాబు ఆయన కేబినెట్ సహచరులు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ప్రభుత్వ అధికారులు హరికృష్ణ అంతిమ యాత్రలో పాల్గోన్నారు.

advertisment

అంతిమ యాత్ర నేపథ్యంలో మెహిదిపట్నం నుంచి జూబ్లిహిల్స్ వరకు ట్రాపిక్ ఆంక్షలు విధించి వాహనాలను వివిధ మార్గాలకు దారి మళ్లించి ప్రజా రవాణాకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలను నగర పోలీసులు తీసుకొన్నారు.

ఎన్.టి.ఆర్ తనయుడుగా హరికృష్ణకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక స్మతి కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలుగురాష్ట్రాలలో పెద్ద షాక్ గా నిలిచిపోయింది. హరికృష్ణ మరణంపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. మరో వైపు ఎపి సి.ఎం. చంద్రబాబుకు హరికృష్ణ స్వయంగా బావ కావడంతో ముఖ్యమంత్రి ఈ రెండు రోజులు తీవ్ర దిగ్బాంతికి లోను అయ్యారు. ఆయన పూర్తి సమయాన్ని హైదరబాద్ లోనే గడపాల్సి వచ్చింది.