జపాన్ లోఉద్యోగావకాశాలపై మదనపల్లి మిట్స్ లో అవగాహన సదస్సు

0
487

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించిన జపాన్ లో భారతీయులకు ఎన్నో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జపాన్ లోని నాగసాకి నగరం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా సిల్వర్ పీక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరక్టర్ ఎన్.వినయ్ అన్నారు.

గురువారం మిట్స్ లో ఇంజనేరింగ్ విద్యార్థులకు “జపాన్ లో ఉపాధి అవకాశాలు ” అను అంశం పై ఆయన ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈసందర్భంగా వినయ్ మాట్లాడుతూ టెక్నాలజీ పై జపాన్ లో చక్కటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని,ఇందుకు ముందుగా విద్యార్థులు జపాన్ బాషా పై పట్టు సాధించాలని ఆయన సూచించారు. గతంలో జపాన్ ప్రభుత్వం తీసుకొన్న జనాభా నియంత్రణ చర్యల వల్ల నేడు జపాన్ లో ఉన్న జనాభాలో 20% మంది యువత మాత్రమే సమర్థత గలవారు ఉన్నారని, 60% మందికి పైగా వృద్దులు ఉన్నారని అన్నారు.

మన దేశంలో అయితే 50% మంది సమర్థవంతమైన యువత ఉన్నారన్నారు. ప్రస్తుతం సుమారు 3 లక్షలకు పైగా ఉద్యోగాలు జపాన్ లో ఉన్నాయని, ఇక్కడ యువత జపాన్ లో ఉన్న ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జపాన్ దేశం ఒక్కటే తాజా గ్రాడ్యుయేట్స్ కు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని ఆయన అన్నారు. జపాన్ లో రాణించాలంటే విద్యార్థులు ఆదేశ భాషయైన జపనీష్ నేర్చుకోవాలని ఆయన తెలిపారు. కోర్సు పూర్తి అయిన వెంటనే తాజా గ్రాడ్యుయేట్స్ కు జపాన్ దేశ బాష, సంస్కృతి , సాంప్రదాయాలు నేర్చుకోవాల్సిన అవసరముందని అయన అన్నారు.

ఇందుకు మంచి శిక్షణ అవసరమని ఆయన వివరించారు. జపాన్ బాషా పై పట్టు సాధిస్తే నెలకు 1 లక్ష 50 వేలకు మించి జీతం ఉన్న ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని లభిస్తాయని అన్నారు. విద్యార్థులు వారి బి.టెక్ చదువుతున్న సమయం లోనే జపాన్ బాషా పై పట్టు సాధిస్తే వారి కెరీర్ కు బాగుంటుందని అన్నారు.

ఇంజనీరింగ్ రంగం లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ పై ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ప్రపంచం లోనే వృద్దుల సంఖ్య అధికంగా గల దేశం ఒక్క జపాన్ మాత్రమే అని, ప్రస్తుత తరుణంలో ఆ దేశ అభివృద్ధికి యువత ఎంతో అవసరం అన్నారు.

]ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమోటివ్ లు మరియు మెకానికల్ రంగాలలో కూడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. తమ సంస్థ ఇప్పుటి వరకు సుమారు 270 మంది ఇంజనీర్స్ కు  జపాన్ బాష ను నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, మిట్స్ విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

ఈ కార్యాక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్, కోఆర్డినేటర్ ఇంటెర్నేషన్ రిలేషన్స్ యూ. విజయ లక్ష్మి, డీన్ అడ్మిన్ & ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత బసు మరియు విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.