మదనపల్లి వద్ద  స్కూటర్ చెట్టుకు ఢీ కొని యువకుడు మృతి

0
136
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఒక్కగాని ఒక్క కుమారుడనే ఆప్యాయతతో పెంచి పెద్ద చేసి అతడు అందరిలో ఒకడిగా కనిపించడానికి ఓ స్కూటర్ కొనిచ్చిన 15 రోజులలో అదే వాహనం కుమారుడి ప్రాణాలను గాలిలో కలిపి వేసిన విషాద సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా మదనపల్లి వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కొండామర్రిపల్లి గ్రామం కోటూరు గ్రామానికి చెందిన మర్రిపాడు సురేష్, గీత దంపతులకు ఏకైక కుమారుడు మర్రిపాడు వెంకటేష్ (21)  ఇతను  డిప్లమా కోర్సు ఇటివలనే పూర్తి చేశారు. మర్రిపాడు సురేష్ బెంగళూరులోని ఓ కంపెనీ లో మాములు కూలీగా పనిచేసుకొంటూ జీవిస్తున్నారు.

కుమారుడు డిప్లమా కోర్సు పూర్తి చేసి బెంగళూరులో తండ్రితో పాటు ఏదైనా ఉద్యోగం చేసేందుకు ఇటివలబెంగళూరు వెళ్లి,  చిన్న ఉద్యోగాన్ని సంపాదించారు. కుమారుడు కూడ ఉద్యోగంలో చేరడంతో సంతోషించిన తండ్రి మర్రిపాడు సురేష్ కుమారుడికి కొత్త స్కూటర్ ను ఇటివలే 15 రోజల క్రితం కొనిచ్చాడు.

కొత్త స్కూటర్ నడిపే ఆనందంలో మర్రిపాడు వెంకటేష్ బెంగళూరు నుంచి స్కూటర్ లో స్వగ్రామానికి బుధవారం ఉదయం భయలుదేరి మదనపల్లి – నిమ్మనపల్లి మార్గంలో వెళ్లుతుండగా చల్లావారిపల్లి వద్ద వేగంగా వెళ్లి చెట్టుకు ఢీ కొనడంతో వెంకటేష్ అక్కడిక్కడే మరణించారు.

నిమ్మనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

advertisment

ఒక్కగాని ఒక్క కుమారుడు మరణించిన విషయం మృతుడి తల్లిదండ్రులకు పోస్టు మార్టం అయి శవాన్ని ఇంటికి తరలించే వరకు తెలియచేయలేదు. కుమారుడు మరణించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలిపితే వారు తట్టుకోలేరన్న ఆవేదనలో బంధువులు మరణ వార్త చెప్పేందుకు సహసించడం లేదు.