త్యాగానికి ప్రతీక బక్రీద్‌ – ఎమెల్మే డా.తిప్పారెడ్డి

0
36
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
త్యాగానికి, శాంతి, ప్రేమలకు ప్రతీకే బక్రీద్‌ పర్వదినమని మదనపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి అన్నారు.బుధవారం బక్రీద్‌ పర్వదినాన్ని పురష్కరించుకొని నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పర్వదినాన్ని జరుపు కుంటారన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవలు ఐకమత్యంతో మెలగి మతసామరస్యాన్ని కాపాడాలన్నారు.

అదేవిధంగా మదనపల్లి పట్టణంలో అధిక శాతం ముస్లి౦లు నివసిస్తున్నారన్నారు. వారి అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానన్నారు. ప్రస్తుతం కొందరు సమాజంలో కుల,మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని, అలాంటి శక్తులను అంతమొందించడానికి అందరూ కలసికట్టుగా ఉండాలన్నారు.

అనంతరం ముస్లింలతో కలసి బక్రీద్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ జింకా వెంకటాచపతి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

advertisment