తిరుమలలో లోయలో దూకి యువతి ఆత్మహత్య యత్నం… రక్షించమని పోలీసులకు ఫోన్

0
196
advertisment

మనఛానల్ న్యూస్ – తిరుపతి
ఇంట్లో కుటుంబసభ్యులతో గొడవపడి ఇక జీవించుకూడదని భావించి తిరుమలకు వచ్చి లోయలలో దూకేసిన యువతి చనిపోవలేకపోవడంతో తనను రక్షించమని ఏకంగా తానే పోలీసులకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకొన్న సంఘటన ఇది.

సోమవారం తిరుమలలో జరిగిన ఈ సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.కృష్ణా జిల్లా జగ్గయ్య పేట ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఇంట్లో కుటుంబసభ్యులతో వివిధ విషయాలపై గొడవ ఏర్పడింది.

దీనితో ఏదోక విధంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి భయలుదేరి నేరుగా తిరుమలకు చేరింది. దీర్ఘంగా ఆలోచించి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించి తిరుమల కొండలలో అవ్వాచారి లోయ ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి లోయలోకి ఒక్క ఉదుటున దూకింది.

చెట్లు పై నుంచి కిందికి పడడం వల్ల గాయాలతో లోయలో పడిపోయింది. అయితే ప్రాణం పోక పోయే సరికి జీవితంపై మళ్లీ తీపి పుట్టి తన బ్యాగులో ఉన్న సెల్ నుంచి ఎమర్జెన్సీ పోలీసు నెంబర్ కు కాల్ చేసి తన గురించి తెలియచేసి తాను ఇప్పుడు లోయలో ఉన్నానని, తనను రక్షించాలని వేడుకోంది.

పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక అటవీ శాఖ అధికారులకు, అగ్నిమాపక శాఖ వారికి తక్షణం సమాచారం అందించి రంగంలో దిగి యువతి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.

advertisment

వెంటనే ఆ యువతిని రక్షించి తిరుపతిలో ఓ ప్రైవేటు ఈసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. యువతి చెప్పిన వివరాల ఆదారంగా ఆమె బంధువులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.