శ్రీవారి సేవలో పారిశ్రామికవేత్త రాబర్ట్‌ వాద్రా

0
337

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమల
తిరుమల కొండపై వెలసిన కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం ఉదయం సోనియా గాంధీ అల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్‌ వాద్రా దర్శించుకున్నారు.స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు విచ్చేసిన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనానంతరం రాబర్ట్ వాద్రాకు తీర్థప్రసాదాలు అందించారు. కాగా… సోనియాగాంధీకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని వేంకటేశ్వరస్వామివారిని మొక్కుకున్నానని ఆయన మీడియాతో అన్నారు. అదేవిధ౦గా దేశ రాజకీయాల్లో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయన్నరు.

దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అయితే… ఈ మార్పును కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే తీసుకురాగలదని ఆయన అన్నారు. రాహుల్‌ గాంధీ కష్టపడుతున్నారని, రాహుల్‌కు మా కుటుంబం పూర్తి మద్దతు ఉంటుందన్నారు.