పొట్ట దగ్గర కొవ్వు కరగాలంటే కొన్ని చిట్కాలు మీ కోసం…

0
51
advertisment

మనఛానెల్ న్యూస్ – హెల్త్ డెస్క్

మనజీవన విధానంలో ప్రతి పది మందిలో ఎవరో ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య పొట్ట దగ్గర కొవ్వు.  అంతేకాదు దీని వల్ల గుండెజ బ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాలూ ఎక్కువంటారు వైద్యులు. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక నివారణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్, పొట్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు.

రోజులో కనీసం వంద కెలొరీల పోషకాలు ప్రొటీన్ల నుంచి అందేట్టు జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకో కుండా చూస్తాయి.

ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒకరోజులో మనం తినే ఆహారం నుంచి పది గ్రాముల ఆహార సంబం ధిత పీచు అందేట్టు చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు.

advertisment

యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంపల్లోనూ పీచు ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉండి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఓట్స్తో చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి.

ప్రొటీన్ అంటే మాంసకృత్తుల మోతాదు తగి నంతగా ఉండేట్లు చూసుకోవాలి. 

మీగడ తీసేసిన పెరుగూ, పాలూ, చేపలూ, గుడ్లూ తింటే మెరు గైన మాంసకృత్తులు అందుతాయి.