రోజురోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ

0
208

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
భారత దేశ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తూ ఉన్నది. ఇప్పటికే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.70 దాటిపోగా గురువారం ట్రేడింగ్‌లో మరింత కనిష్ఠానికి పడిపోయింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.32కు చేరింది. టర్కీలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కీష్‌ లిరా భారీగా పతనమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసియా దేశాల కరెన్సీతో పాటు, మన రూపాయిపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఆ ప్రభావం మన రూపాయిపై కూడా పడుతోంది.