జలపాతంలో చిక్కుకున్న 45 మందిని రక్షించిన పోలీసులు

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
మధ్యప్రదేశ్‌ పోలీసులు 45 మందిని రక్షించారు. గ్వాలియర్‌లోని శివపురిలో గల సుల్తాన్‌ ఘర్‌ జలపాతాలకు వెళ్లిన పలువురు నీటి ఉధృతి కారణంగా కొట్టుకుపోయారు. డ్యామ్‌ నుండి ఒక్కసారిగా నీటిని దిగువకు వదలడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 45 మందిని రక్షించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

పోలీస్‌ సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ.. తాము 40 మందిని రక్షించగా, ఐదుగురిని హెలికాఫ్టర్‌ సహాయంతో రక్షించామని తెలిపారు. వారిని రక్షించినందుకు పోలీసు యంత్రాంగాన్ని మధ్యప్రదేశ్‌ మంత్రి యశోదరా రాజే సింథియా అభినందించారు. అవసరమైన సహాయచర్యలు చేపట్టడానికి సిద్దంగా ఉన్నామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు హామీనిచ్చారు.

అన౦తర౦ రాష్ట్రంలో నేరాలను నియంత్రించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానాన్ని వినియోగిస్తున్నారని పోలీసులను ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అభినందించారు. ప్రజల భద్రతను కల్పించడం కోసం డయల్‌ 100 మొబైల్‌ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

advertisment