మదనపల్లి పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

0
177
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
మదనపల్లి పట్టణంలోని గౌసియా వీధిలో ఇరువర్గాల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు గౌసియా వీధిలో అన్వర్‌ అనే వ్యక్తి ఇంట్లో బషీర్‌ అహ్మద్‌ అతని కుటుంబం అద్దెకు ఉండేవారు.

అయితే 2016వ సంవత్సరం నుండి బషీర్‌ అహమ్మద్‌ తనకు అద్దె చెల్లించపోవడమే కాకుండా దౌర్జన్యానికి పాల్ప డుతున్నాడని, ఇంటి యజమాని అన్వర్‌ కోర్టును ఆశ్రయించారు. సదరు కోర్టు ఇళ్లు ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఇళ్లు ఖాళీ చేసే సమయంలో ఇంటి యజమానికి అద్దెకు ఉన్న కుటుంబానికి ఘర్షణ తలెత్తింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారిని వారించడంతో వివాదం సద్దుమణిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

advertisment