
మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
కారు అదుపు తప్పి మురుగు కాలువలో పడిన ఘటనలో గుజరాత్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పంచమహాల్ జిల్లాలోఆదివారం ఈ ప్రమాదం సంభవించింది.
కారు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో కారు మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం పదిమంది చిన్నారులు ఉన్నారు.
జంబుహోడా నగరంలోని భట్ గ్రామానికి సమీపంలో హలోల్-బోడేలి రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కారు మురుగు కాల్వలో పడిపోవడంతో స్థానికులు గుర్తించి ముగ్గురిని రక్షించగా, ఏడుగురు చిన్నారులను రక్షించలేకపోయారని ఇన్‌స్పెక్టర్ ఎ.బి. దేవధా తెలిపారు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వారి పట్టణమైన బోడేలికి వెళుతుంటే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.