కరుణానిధిని ఆఖరిసారి చూసేందుకు భారీగా తరలివస్తున్న అభిమానులు

0
113

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
డీఎంకే అధినేత ‘‘కలైంజ్ఞర్‌’’ కరుణానిధిని ఆఖరిసారి చూసేందుకు అభిమమానులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్ధీవ దేహాన్ని రాజాజీ హాల్‌కు తరలించారు.తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చెన్నైకు తరలివస్తున్నారు.

వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మరోవైపు అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత కరుణానిధికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ జాతీయ జెండాను అవనతం చేయనున్నారు.

కరుణకు అంజలి ఘటించేందుకు పలువురు నేతలు చెన్నైకు రానున్నారు. ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు తరలివస్తున్నట్లు డీఎంకే వర్గాలు తెలిపాయి.