తొలి టీ20లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన వెస్టిండీస్‌

0
202

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం సెయి౦ట్ కిట్సులో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ చిత్తుచేసింది. ముందుగా బ్యాటి౦గ్‌ చేసిన బంగ్లాదేశ్‌ వెస్టిండీస్‌ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. మహ్మదుల్లా 35, మూడు ఫోర్లు, 2 సిక్సర్లు, లిటన్‌ దాస్‌ 21, 3 ఫోర్లు ఓ మోస్తరుగా రాణించారు.

వెస్టిండీస్‌ బౌలర్లలో విలియమ్స్‌ 4 వికెట్లు, నర్సే 2 వికెట్లు, కీమో పౌల్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విండీస్‌ విజయలక్ష్యాన్ని 9 ఓవర్లలో 91 పరుగులకు నిర్ధేశించారు.

లక్ష్య చేధనలో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 9.1 ఓవర్లలో 93 పరుగులు చేసి విజయా న్నందుకుంది. రస్సెల్‌ 35, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు, శామ్యూల్స్‌ 2 ఫోర్లు, సిక్స్‌లతో రాణించారు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించింది.