భారీ వర్షాలకు ఉత్తర ప్రదేశ్‌ అతలాకుతలం – 70 మంది మృతి

0
37
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
భారీ వర్షాల ధాటికి ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 70 మంది మృతిచెందగా, మరో 77 మంది గాయపడ్డారు.ఒక్క షహరాన్‌పుర్‌ జిల్లాలోనే 11 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపు 70 మంది మృత్యువాత పడ్డారు. గాయపడ్డ వారి సంఖ్య 77కు చేరింది. 488 ఇళ్లు దెబ్బతిన్నాయని విపత్తు నిర్వాహక కమిషనర్‌ సంజయ్‌ ప్రసాద్‌ తెలిపారు.పరిస్థితి ఘోరంగా ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లాలోని సీనియర్‌ అధికారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను సందర్శించి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. వారిని ఆర్థిక, వైద్యసహాయం అందించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా సోమవారం సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ, అతిభారీ, ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

advertisment