శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

0
219

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీగా యధావిధిగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా తిరమల కొండపై ఇదే పరిస్థితి నెలకొని ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అలాగే టైంస్లాట్ సర్వదర్శన౦, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) శ్రీవారిని 70,913 మంది భక్తులు దర్శించుకున్నారు.సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల కోసం తితిదే అధికారులు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు.