హన్మకొండలో సందడి చేసిన కాజల్‌ అగర్వాల్‌

0
28
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హన్మకొండ
ప్రముఖ తెలుగు సినీ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ గురువారం హన్మకొండలో సందడి చేశారు. హ్యాపీ మొబైల్స్‌ షోరూంను ప్రారంభించేందకు ఆ సంస్థ ప్రతినిధులు కాజల్‌ అగర్వాల్‌ను ఆహ్వానించారు. దీంతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె విచ్చేశారు. ఆమె తన చేతుల మీదుగా హ్యాపీ మొబైల్‌ స్టోర్స్‌కు జ్యోతి వెలిగించి, తదనంతరం రిబ్బన్‌ను కత్తిరించారు. తమ అభిమాని కథానాయకిని చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తనను ఇంత మంది అభిమానిస్తుండడం తన అదృష్టమన్నారు. తెలుగులో మరిన్ని చిత్రాలతో మీ ముందుకు వస్తానని ఆమె తెలిపారు. అనంతరం హ్యాపీ మొబైల్‌ స్టోర్స్‌ ప్రతినిధులు ఆమె ఘనంగా వీడ్కోలు పలికారు.

advertisment