చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ – ఏడుగురు మావోయిస్టుల హతం

0
50

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
మరోసారి అడవుల్లో తుపాకీ శబ్ధాలు మార్మోగాయి.చత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఆ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ మృతిచెందారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. తిమెనార్ ఫారెస్ట్ ఏరియా నుంచి నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

దంతెవాడ-బీజాపుర్ బోర్డర్‌లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, ఎస్‌టీఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. నక్సల్స్ స్థావరాల నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు, ఒకటి 12 బోర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అటవీ ప్రాంతంలో ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఉద‌యం 6 గంట‌ల‌కు ఎదురుకాల్పులు జ‌రిగాయి. దంతెవాడ జిల్లా బోర్డ‌ర్‌లోని తిమినార్‌, పుస్నార్ గ్రామాల స‌మీపంలో ఈ ఘ‌ట‌న జరిగింది. రాష్ట్ర రాజ‌ధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీట‌ర్ల దూరంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.