గ్యాస్ట్రికి సమస్యకు నివారణా మార్గాలు…

0
67
advertisment

మనఛానెల్ న్యూస్ – హెల్త్ డెస్క్

గ్యాస్ట్రికి సమస్య వున్నవారు సరిగా తినకపోవడం, తొందరగా తిన్నది జీర్ణం కాకపోవడంచ కడుపులో మంట, పులుపు, కారం లాంటివి ఎక్కువ తినలేకపోవడం వంటి ఎన్నో బాధలు పడుతున్నారు. గ్యాస్ వల్ల పొట్టలో ఉబ్బరం కలుగుతుంది. త్రేన్పులు వస్తాయి. కడుపులో నొప్పి, అజీర్ణం కలుగుతుంది. విపరీతమైన నొప్పి. దీని నుండి బయట పడటం ఎలా? గ్యాస్ ఎందుకు తయారవుతుంది? దాని నివారణకు ఇంట్లోనే చేసుకునే నివారణా మార్గాలు మీ కోసం…

మనం తినే ఆహారం, నమల కుండా గబగబా మింగడం, మాట్లా డుతూ తినడం, నోరు ఎక్కువగా తెరచి నమలడం, కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం. ఇంకా ఆహార నాళంలో జీర్ణం కాని షుగర్స్ను కోలన్లో బాక్టీరియా స్వీకరించి, గ్యాస్ ను విడుదల చేస్తాయి. పేగులలో కొన్ని బాక్టీరియా గ్యాసును ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.

గ్యాస్ రాకుండా వుండాలంటే… ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా, తక్కువగా తినాలి. జరా వంటి వాటి జోలికి వెళ్ళకూడదు. కొన్ని వ్యాయామ పద్ధతులు పాటించాలి. కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు తగ్గించాలి. వేళకు భోజనం చేయాలి. రోజుకు 10-12 గ్లాసుల నీరు తాగాలి. .
నివారణకు వంటింటి చిట్కాలు..

ధనియాలు నమిలితే అది గ్యాసిను పోగొడుతుంది. కడుపునొప్పిని ఈగిస్తుంది. కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి కూడా తాగొచ్చు. గ్యాస్ రిలీఫీకి ఇంగువ బాగా పనిచేస్తుంది. .

advertisment

తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. ఒక గ్లాసు మరుగుతున్న నీటిలో పీచ్ ఆకులు వేసి 10-15 నిమిషాల తర్వాత తాగాలి. రోజుకు మూడు సార్లు చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

అరచెంచా వాముపొడి, చెండా యాలకుల పొడి, ఒక చెందా మిరియాల పొడి, తొంటి పొడి చెంచా కలిపి ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు 400 మిల్లీ లీటర్ల నీటితో తీసుకుంటే అజీర్ణం, గ్యాస్ ఉబ్బరం తగ్గుతాయి.

తులసి ఆకులు నమిలితే కడుపులో గ్యాస్ ఏర్పడదు. మిరియం, శొంఠి, ఏలకులు ఒక్కొక్కటీస్పూన్ చొప్పున తీసుకుని పొడి చేసి అరస్పూన్ నీటిలో కలిపి భోజనం తరువాత అరగంట ఆగి తాగాలి.