మాక్‌ డ్రిల్‌లో భాగంగా రెండో అంతస్తు నుండి పడి యువతి మృతి

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
తమిళనాడులోని కోయంబత్తూరులో విషాదం చోటుచేసుకుంది.ఓ కాలేజీలో నిర్వహిస్తున్న మాక్‌డ్రిల్‌లో అపశృతి చోటు చేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థిని లోగేశ్వరి చనిపోయింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కోయంబత్తూరులోని కళైమగల్ కాలేజీలో మాక్‌డ్రిల్ నిర్వహించింది.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా ప్రాణాలను రక్షించుకోవాలన్న దానిపై ఎన్‌డీఎంఏ సిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న లోగేశ్వరి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాల్సి వచ్చింది. లోగేశ్వరి కిందకు దూకినా ప్రమాదం జరగకుండా ఉండేందుకు కింద వలలతో విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు.

ఆమె పక్కనే ఎన్డీఆర్ఎమ్ శిక్షకుడు కూడా ఉన్నారు.కిందకు దూకేందుకు లోగేశ్వరి భయపడింది. చాలా సేపు టెన్షన్ పడింది. పక్కనే ఉన్న ఎన్‌డీఎంఏ శిక్షకుడు ధైర్యం చెప్పినా వినలేదు. చివరకు ఆ శిక్షకుడు లోగేశ్వరిని కిందకు తోశాడు. దీంతో రెండో అంతస్తు నుంచి దూకుతుండగా మొదటి అంతస్తు దిమ్మె తగలడంతో లోగేశ్వరి తలకు తీవ్రంగా గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే లోగేశ్వరిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోగేశ్వరి చనిపోయింది.

advertisment