Monday, May 20, 2019
Home ఆంధ్రప్రదేశ్ కిశోర్ టిడిపిలోకి వద్దంటే వెళ్లాడు…- మాజీ సి.ఎం. నల్లారి కిరణ్

కిశోర్ టిడిపిలోకి వద్దంటే వెళ్లాడు…- మాజీ సి.ఎం. నల్లారి కిరణ్

0
493
advertisment

బ్యూరో ఛీఫ్ – మనఛానల్ న్యూస్, న్యూఢిల్లీ
ఎపి మాజీ సి.ఎం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం  కాంగ్రెస్ పార్టీలోకి చేరి అనంతరం ఢిల్లీలో ఎఐసిసి కార్యాలయంలో పలు విషయాల గురించి మాట్లాడారు.

ముఖ్యంగా తన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు తాను కిశోర్ కుమార్ రెడ్డికి టిడిపిలో చేరవద్దని, తొందరపడవద్దని చెప్పానని అయితే అతను టిడిపిలో చేరినట్లు తెలిపారు. ఇప్పుడది అతని వ్యక్తిగత విషయమని కిరణ్ వివరించారు.

తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ పార్టీలలోకి చేరిన వారందరిని తిరిగి పార్టీ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. ఇప్పుటికే 35 నుంచి40 మంది మాజీ ఎం.ఎల్.ఎలు, ఎం.పిలు తనకు టచ్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.

2019 ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎపి విభజన సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. 2019 ఎన్నికలలో రాహుల్ గాంధి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు.

తాను రాజకీయాలలో ఇంత గుర్తింపు పొందడానికి కాంగ్రెస్ పార్టీ యే కారణమని, కాంగ్రెస్ పార్టీ వల్లే తాను ఎం.ఎల్.ఎ,చీఫ్ విప్, స్పీకర్, సి.ఎం. స్థాయి పొందానని అన్నారు. తమ కుటుంబానికి గాంధి కుటుంబంతో తన తండ్రి నల్లారి అమరనాథరెడ్డి కాలం నుంచి నా వరకు సాన్నిహిత్యం ఉండడం వల్లే తమకు ఈ అవకాశాలు వచ్చాయని ఆయన వివరించారు.

advertisment

2019 ఎన్నికలలో శాయశక్తులా పోరాడి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రావడానికి ప్రయత్నిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎపికి రావాల్సిన స్పెషల్ స్టేటస్, ఇన్సింటేవ్స్ గాని, యూనివర్సిటిలుగాని, ఇతర సంస్థలుగాని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే సాద్యమని ఆయన అన్నారు.

పోలవరం పూర్తి కావాలన్నా, కడపకు ఉక్కు పరిశ్రమ రావాలన్నా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భావించే తాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలుగు రాష్ట్రాలు రెండు అభివృద్ధి పథంలో నడుస్తాయని ఆయన అన్నారు.