రికార్డులను తిరగరాస్తున్న ”సంజు”

0
44
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం సంజు.ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ కథనాయకుడు. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తూ రూ.200 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది.

విక్కీ కౌశల్‌, మనీషా కొయిరాలా, పరేశ్‌ రావల్‌, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, దియా మీర్జా, టబు, షియాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు అందించారు.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.34.75 కోట్లు వసూలు చేసి, ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది.

అంతేకాదు రణ్‌బీర్‌, రాజ్‌కుమార్‌ సినీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రమిది. ఇది మూడు రోజుల్లో రూ.120 కోట్లకుపైగా రాబట్టి మరో రికార్డు సృష్టించింది.కాగా ఈ చిత్రం మంగళవారానికి మొత్తం రూ.167.51 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్‌ తెలిపారు.

శుక్రవారం రూ.34.75 కోట్లు, శనివారం రూ.38.60 కోట్లు, ఆదివారం రూ.46.71 కోట్లు, సోమవారం రూ.25.35 కోట్లు, మంగళవారం రూ.22.10 కోట్లు మొత్తం రూ.167.51 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. ఈ సినిమా రూ.200 కోట్ల దిశగా చిత్రం పరుగులు తీస్తోందని తెలిపారు.

advertisment