
మనఛానల్ న్యూస్ – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ఈ నెల 7న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ప్రమాణ స్వీకారానికి సంబంధించి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఎస్కే జోషి మంగళవారం ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది జనవరిలో కేంద్రానికి సిఫారసు చేసింది.ఈ సిఫారసులకు ఇటీవల ఆమోదం తెలిపిన కేంద్రం ఫైల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు పంపింది. ఆ ఫైల్‌పై ఆదివారం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ నియమితులయ్యారు.