భళా బెల్జియం – ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశం

0
38
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం అద్భుతం చేసింది.ఓడిపోతుందనుకునే మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకొని ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.సోమవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌పై 2-3 గోల్స్ తేడాతో నెగ్గింది. ఓ దశలో ఓటమి తప్పదనుకున్న బెల్జియం.. అనూహ్యంగా సెకండ్ హాఫ్‌లో పుంజుకున్నది. క్వార్టర్స్‌లో శుక్రవారం రోజున బ్రెజిల్‌తో బెల్జియం తలపడుతుంది.

ఫస్ట్ హాఫ్‌లో జపాన్ అద్భుత ఆటను ప్రదర్శించింది. ఆసియా టీమ్ జోరుకు బెల్జియం ఆందోళనకు గురైంది. సెకండ్ హాఫ్ ఆరంభలో జపాన్ త్వరత్వరగా రెండు గోల్స్ చేసింది. ఆట 48వ నిమిషంలో హరగూచీ, 52వ నిమిషంలో ఇన్నూ గోల్స్ చేసి జపాన్‌కు ఆధిక్యాన్ని అందించారు. ఆ దశలో బెల్జియం గెలవడం అసాధ్యంగానే తోచింది.

కానీ యురోపియన్ టీమ్ చివరి నిమిషాల్లో దూకుడును ప్రదర్శించింది. 69వ నిమిషంలో వెర్టోంజన్, 74వ నిమిషంలో ఫెల్లయిని, 90వ నిమిషంలో చాడ్లీలు గోల్స్ చేసి బెల్జియంను విక్టరీ బాటలో నడిపించారు. రెండు గోల్స్ తేడాతో వెనుకబడి ఉన్న బెల్జియం…ఆ తర్వాత ఊహించని రీతిలో కోలుకుని జపాన్‌ను స్టన్ చేసింది.

advertisment