ముంబయిలో నేలకూలిన చార్టెడ్‌ విమానం – ఐదుగురు దుర్మరణం

0
73

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
గురువారం మధ్యాహ్నం ముంబయిలోని ఘట్కోపర్‌ ప్రాంతంలో ఓ చార్టెడ్‌ విమానం కుప్పకూలింది.మరికాసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉండగా ఆ విమానం నివాసాల మధ్యే కూలి, మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది.

విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని వారు తెలిపారు.