నేడు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమ౦

0
66
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నెల్లూరు
నేడు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపి వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన నెల్లూరు టిడిపి జిల్లా కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు.ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో చిట్టమూరు మండలం ఈశ్వరవాకలో ఏరువాక నిర్వహిస్తున్నామన్నారు.

రైతులందరూ ఏరువాక పండగలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతులను చైతన్య పరిచేలా వివిధ కార్యక్రమాలను ఏరువాక పౌర్ణమిలో చేస్తామని చెప్పారు. లోటు బడ్జెట్‌లోనూ రైతు రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సాధించామని అన్నారు. రైతు రుణవిముక్తికి సంబంధించి 8,100 కోట్ల రూపాయలు 4, 5 వ విడతల్లో విడుదల చేయనున్నామని చెప్పారు.

ఎపిపై ప్రధాని మోదీకి ఎందుకు అంత కక్షో అర్ధం కావడం లేదన్నారు. కడప ఉక్కు కర్మాగారం కోసం సిఎం రమేష్‌, బీటెక్‌ రవి చేస్తున్న దీక్షపై కేంద్రం స్పందించకపోవడం దారుణమని చెప్పారు. వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నా పట్టించుకోరు, పైగా గాలి జనార్ధన్‌ రెడ్డిని తెరపైకి తెచ్చారని విమర్శించారు.

advertisment