మహేష్‌ కొత్త సినిమాలో అదితిరావు హైదరీ…

0
364

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
ప్రిన్స్‌ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విషయం విదితమే.ఈ చిత్రానికి సి.అశ్వనీదత్, దిల్‌రాజు నిర్మాతలు. ఇది మహేశ్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా కావడం విశేషం.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, మరో హీరోయిన్‌గా అదితిరావు హైదరీ ఎంపికైందని తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన ‘సమ్మోహనం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌కి అదితి నటన బాగా నచ్చిందట. అందుకే తన సినిమాలో మరో హీరోయిన్‌గా ఆమె పేరు సూచించినట్టు సమాచారం.

అయితే ఈ విషయం ఇప్పటివరకు యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.