
మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం నుంచి అర్థాంతరంగా బీజేపి వైదొలగడంపై పీడీపి మండిపడింది.ఇదే౦ పద్దత౦టూ నిలదీసింది. మూడేళ్లుగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ మాటమాత్రంగానైనా చెప్పకుండా తెగతెంపులు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించింది.
పీడీపీతో పొత్తు ఉపసంహరించుకుంటూ బీజేపీ మంగళవారం నిర్ణయం తీసుకోవడంతో గవర్నర్ పాలన అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నిర్ణయాన్ని పీడీపీ ప్రతినిధి రఫీ అహ్మద్ మిర్ తప్పుపట్టారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపేందుకు చేయగలినంతా మేము చేశాం.
అయితే అనుకోకుండా ఇలా (బీజేపీ తెగతెంపులు) జరిగింది. బీజేపీ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. కనీసం మాట మాత్రంగానైనా తమ నిర్ణయాన్ని మాకు చెప్పలేదు. ఎలాంటి సూచనలు కూడా చేయలేదని ఆయన బీజేపీని తప్పుపట్టారు. పరిస్థితిని పీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి మెహబూబా ముఫ్తీ సమీక్షించి తగిన వ్యూహంతో ముందుకు వెళ్తారని ఆయన చెప్పారు.