కపూర్‌ కుటుంబం నుంచి మరో హీరోయిన్‌

0
29
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
గతంలో సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వారసులు సినిమాల్లో ప్రవేశం చేసేది ఆనవాయితీగా మారిపోయింది.బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌- శ్రీదేవి దంపతుల కూతురు జాన్వీ కపూర్‌ ‘దడక్‌’ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

తాజాగా కపూర్ల ఫ్యామిలీ నుంచి మరో అమ్మాయి కూడా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. బోనీ కపూర్‌ సోదరుడు సంజయ్‌ కపూర్‌ కూతురు షనాయాను ఈ ఏడాది హీరో​యిన్‌గా పరిచయం చేసేందుకు కపూర్ల ఫ్యామిలీ సన్నాహాకాలు చేస్తోందట.

ఈ విషయం గురించి సంజయ్‌ కపూర్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షనాయా ప్రస్తుతం ప్లస్‌ టూ పూర్తి చేసింది. అయితే ఏం జరుగుతుందో ముందే ఊహించలేం కదా. తన కెరీర్‌ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ కచ్చితంగా తను అనుకున్నది సాధిస్తుంది. ఇప్పటివరకైతే ఏ మూవీకి సైన్‌ చేయలేదు.

అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. అక్క సోనమ్‌ పెళ్లిలో, జాన్వీ కపూర్‌ ‘దడఖ్‌’ ట్రైలర్‌ విడుదల సమయంలో ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించిన షనాయాకు ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది.