నేటి నుండే సాకర్‌ సమరం

0
43
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
రష్యా వేదిక 21వ సాకర్‌ ప్రపంచకప్‌ సమరం నేటి నుండి ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 32 రెండు జట్లు పాల్గొంటున్నాయి.గురువారం లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో టోర్నీ ఆరంభమవుతుంది. అక్కడే తొలి మ్యాచ్‌. ఈ ప్రపంచకప్‌లో అత్యంత తక్కువ ర్యాంకు జట్లు రష్యా, సౌదీ ఆరేబియాలు తలపడతాయి.

టైటిల్‌ కోసం అనేక జట్లు గట్టిగా పోటీలో ఉన్నాయి. స్వీన్‌స్టీజర్‌, క్లోజ్‌ వంటి స్టార్లు లేకున్నా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కుర్రాళ్లు టిమో వెర్నర్‌, జోషువా కిమిచ్‌, డ్రాక్ల్సర్‌, రుడిజెర్‌.. అనుభవజ్ఞులైన ఓజిల్‌, గోమెజ్‌, హమెల్స్‌, ర్యూస్‌, న్యూర్‌ వంటి ఆటగాళ్లతో జర్మనీ దుర్భేద్యంగా కనిపిస్తోంది.

ఇక బ్రెజిల్‌ ఫేవరెట్‌గా లేని ప్రపంచకప్పును ఊహించలేం. ఈసారి కూడా అంతే. గత ప్రపంచకప్‌ పరాభవం తర్వాత రూపాంతరం చెందిన బ్రెజిల్‌ నెయ్‌మార్‌, జీసన్‌, ఫిర్మినో వంటి స్టార్‌ ఆటగాళ్లతో కదనోత్సాహంతో ఉంది. కనీసం సెమీఫైనల్‌ వరకైనా ఈ జట్లకు ఎదురుండకపోవచ్చు. అర్జెంటీనా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, బెల్జియం కూడా ఎన్నో ఆశలతో టోర్నీలో అడుగుపెడుతున్నాయి.

తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో ఎదుర్కోవడం రష్యాకు పెను సవాలే. రెండూ పెద్ద ర్యాంకు జట్లేమీ కానప్పటికీ సౌదీదే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. సొంత అభిమానుల నుంచి భారీ అంచనాలున్న నేపథ్యంలో రష్యాపైనే ఒత్తిడి. అది ఈ టోర్నీలో అత్యంత తక్కువ ర్యాంకు (70వ) జట్టు. రష్యా గత 15 మ్యాచ్‌ల్లో ఆ జట్టు కేవలం మూడు మ్యాచ్‌లో నెగ్గింది.

అలన్‌ జగోవ్‌, డెనిస్‌ చెరిషెవ్‌, స్మొలోవ్‌లు ఆ జట్టుకు కీలక ఆటగాళ్లు. 2006 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న సౌదీ అరేబియా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోంది. అంచనాలు లేకపోవడం తమకు లాభించే అంశమని సౌదీ భావిస్తోంది.మొత్తం 12 మైదానాల్లో 64 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఐస్‌లాండ్‌, పనామా జట్లు తొలిసారి పాల్గొంటున్నాయి.

advertisment